విదేశీ విద్యపై “గ్లోబల్ డిగ్రీస్ ఎడ్యుకేషన్” సదస్సు.మన ధ్యాస, నెల్లూరు,మే 30:నెల్లూరు నగరంలోని డాక్టర్ జెట్టి శేషారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ నందు గ్లోబల్ డిగ్రీస్ ఎడ్యుకేషన్ మరియు మోర్ కన్సల్టెన్సీ సర్వీస్ వారు శనివారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మీనా కుమార్ జస్టి మాట్లాడుతూ……గ్లోబల్ డిగ్రీస్ ఎడ్యుకేషన్ మరియు మోర్ కన్సల్టెన్సీ సర్వీస్ దేశ,విదేశాలలో పెద్ద చదువుల కొరకు సెమినార్ సమావేశం నిర్వహిస్తోంది. ఈ కన్సల్టెన్సీ ద్వారా ఆసక్తి కలిగిన విద్యార్థులకు దేశ,విదేశాలలో అన్ని కోర్సులలో ఎం.ఎస్.,మెడిసిన్,పి.జి. అవకాశాలు కల్పిస్తోంది.ఆస్ట్రేలియా,కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్ (యు.కె. లండన్),యు.ఎస్.ఏ,జర్మనీ, ఇటలీ,ఐర్లాండ్,న్యూజిలాండ్ వంటి దేశాల్లో చదవాలనే ఆసక్తి గల వారు ఈ సెమినార్‌లో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుతున్నారు.గ్లోబల్ డిగ్రీస్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ మోర్ కన్సల్టెన్సీ సర్వీస్, విద్యార్థులకు స్కాలర్‌షిప్ అవకాశాలను కల్పిస్తోంది. తక్కువ ఖర్చుతో డిగ్రీని పూర్తి చేసుకొని రాగలరని, అలాంటి అవకాశాన్ని గ్లోబల్ డిగ్రీస్ ఎడ్యుకేషన్ మరియు మోర్ కన్సల్టెన్సీ సర్వీస్ కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 200 పైకి లకు విద్యార్థులను లండన్, అమెరికా, కెనడా వంటి దేశాలకు పంపించడం జరిగిందని, నెల్లూరులో ఎన్ వి ఆర్ సెంట్రల్, బొల్లినేని హాస్పిటల్ ఎదురుగా మూడవ అంతస్తులు, గ్లోబల్ డిగ్రీ ఎడ్యుకేషన్ మోర్ కన్సల్టెన్సీ సర్వీస్ ఆఫీసును,అవసరమైన వాళ్లు సందర్శించి మా సేవలను అద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఇ.రామారావు, జీవి.కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
