మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్), మే 5:
జుక్కల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆయిల్ ఫామ్ తోటను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో ముఖాముఖి సమావేశమై ఉద్యాన పంటల సాగు, ఆయిల్ ఫామ్ విస్తీర్ణం పెంపుదల, అలాగే ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించారు.ఆయిల్ ఫామ్ పంట నాటిన తరువాత సుమారు నాలుగు సంవత్సరాల నుంచి దిగుబడి ప్రారంభమవుతుందని, అనంతరం క్రమంగా ఆర్థిక లాభాలు పెరుగుతాయని ఎమ్మెల్యే వివరించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించే పంటలను రైతులు ఎంచుకోవాలని, ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని సూచించారు.ఆయిల్ ఫామ్ సాగు విస్తరణతో రైతులకు స్థిరమైన ఆదాయం సాధ్యమవుతుందని తెలియజేస్తూ, ఈ పంటను వేసిన రైతులను ఎమ్మెల్యే సన్మానించారు. ప్రభుత్వం ద్వారా రైతులకు అన్ని విధాలుగా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ఇదే ప్రజా ప్రభుత్వం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో మారుతి, వ్యవసాయ అధికారి మహేశ్వరి, జుక్కల్ గ్రామ సర్పంచ్ కర్రేవార్ సావిత్రి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయా గౌడ్, చండేగావ్ సర్పంచ్ బండేడ్ వార్ లక్ష్మన్, పెద్దగుల్ల సర్పంచ్ మాదారావ్ దేశాయి, గ్రామస్తులు రాజుల్ సేట్, దాదారావ్ పటేల్, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *