మన ధ్యాస,నిజాంసాగర్ ( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామంలో ఎల్లమ్మ జాతర ఉత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయని ఆలయ కమిటీ అధ్యక్షుడు బంగ్లా ప్రవీణ్ కుమార్ ముదిరాజ్ తెలిపారు.మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరకు గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారని చెప్పారు. జాతర సందర్భంగా గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొన్నదన్నారు.నేడు సంప్రదాయం ప్రకారం ఎల్లమ్మ తల్లికి ఓడి బియ్యం పోయడం కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. మహిళలు హారతులు పట్టి అమ్మవారిని కొలిచారని, భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారని చెప్పారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయిందన్నారు.జాతరలో భాగంగా రేపు భజన కీర్తనలు, మంగళవారం బండ్ల బోనాలు, రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బుధవారం కుస్తీ పోటీలు కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.జాతరకు వచ్చిన భక్తులకు తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించామని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని బంగ్లా ప్రవీణ్ కుమార్ ముదిరాజ్ కోరారు.
