89777 79471కు ఫోన్‌కాల్ ద్వారా సమస్యల నమోదుకు అవకాశం
ప్రతినెలా మొదటి బుధవారం వీడియో కాన్ఫరెన్స్
ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి శివశంకర్ లోతేటి వెల్లడి
తిరుపతి, మే 3: ఎపిఎస్పిడిసిఎల్ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రాధాన్యతనిస్తున్నామని ఆ సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, వ్యవస్థలో లోటుపాట్లు, ఓల్టేజ్ మార్పులు, బిల్లింగ్, సోలార్ నెట్ మీటరింగ్, ఓపెన్ యాక్సెతోపాటు భద్రతా అంశాలకు సంబంధించిన సమస్యలను పారిశ్రామిక వినియోగదారులు చర్చించేందుకు వీలుగా ప్రతినెలా మొదటి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహిస్తామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనదలచిన పారిశ్రామిక వినియోగదారులు ప్రతి నెలా మొదటి బుధవారానికి 7 రోజుల ముందు నుంచి మొదటి మంగళవారం మధ్యాహ్నం 2 గంటల వరకు 8977779471 ఫోన్ నంబరుకు కాల్ చేయడం ద్వారా తమ పేరు, మొబైల్ నంబరు, హెచ్ టి సర్వీసు నంబరు, పరిశ్రమ పేరు, పరిశ్రమ స్వభావం, పరిశ్రమను నెలకొల్పిన స్థలం, జిల్లా తదితర అంశాలతోపాటు విద్యుత్ సమస్యకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకోవాల్సి వుంటుందని తెలియజేశారు. ఈ ప్రక్రియ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో సంబంధిత అంశాన్ని లోతుగా చర్చించి, పరిష్కరించుకునేందుకు అవకాశం వుంటుందని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లింకును ప్రతి నెలా మొదటి మంగళవారం సాయంత్రంలోగా సంబంధిత వినియోగదారులకు పంపడం జరుగుతుందన్నారు. పారిశ్రామిక వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎసిఎస్పిడిసిఎల్ పరిధిలో ప్రతి నెలా మొదటి బుధవారం ఆయా సర్కిళ్ళ సూపరింటెండింగ్ ఇంజనీర్ల కార్యాలయాల్లోనూ, 3వ బుధవారం ఎపిఎస్పిడిసిఎల్ కార్పొరేట్ కార్యాలయంలోనూ నిర్విహించే పారిశ్రామిక వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను ఇకపై రద్దు చేస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
రేపు ‘డయల్ యువర్ ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి’
తిరుపతి, మే 3: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 4వ తేదీన ఉదయం 10:00 గం||ల నుంచి మధ్యాహ్నం 12:30 గం||ల వరకు ‘డయల్ యువర్ సిఎండి’ కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్ నిర్వహించనుంది. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సిఎండి కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు మొబైల్ నంబరు: 8977716661కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సిఎండి దృష్టికి తీసుకురావచ్చు. ఈ కార్యక్రమం ద్వారా తమ విద్యుత్ సమస్యలను సిఎండి దృష్టికి తీసుకురాదలచిన వినియోగదారులు తమ వద్ద విద్యుత్ సర్వీసు నంబరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.
సర్కిల్ స్థాయిలోనూ డయల్ యువర్ ఎస్ఈ
డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి కార్యక్రమంతో పాటు సర్కిల్ స్థాయిలో కూడా ప్రతి సోమవారం ఉదయం 8:30 నుంచి 9:30 గం||ల వరకు ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాస్థాయిలో తమ విద్యుత్ సమస్యలను సూపరింటెండింగ్ ఇంజనీర్ దృష్టికి తీసుకువచ్చేందుకు వీలుగా వినియోగదారులు ఈ క్రింద పేర్కొన్న నంబర్లకు కాల్ చేయవచ్చు.
తిరుపతి: 8712652679
చిత్తూరు: 7993147979
నెల్లూరు: 08612320427
అన్నమయ్య: 9440817449
కడప: 08562242457
కర్నూలు: 7382614308
నంద్యాల: 7382618976
అనంతపురం: 9154790350
శ్రీసత్యసాయి: 9963707847
