తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి , మాజీ మంత్రి మరియు పలమనేరు శాసనసభ్యులు శ్రీ అమరనాథ్ రెడ్డి తో కలిసి ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
ఉదయం విరామ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రవేశం చేసిన నేతలు ఇరువురు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరికి ఆశీర్వచనం పలికి స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.





