సేవకుడా మీ సేవలకు సలాం….

మంచి మనసున్న మనిషి, సౌమ్యడు మరియు నిరంతరం 10 మంది శ్రేయస్సు కోరుకునే అందరివాడు..జబ్బర్ ట్రస్ట్ అధినేత డాక్టర్ షేక్ ఫరీద్ బాబా గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

గత 25 సంవత్సరాలుగా అనాధలకు పేదలకు మరియు వితంతువులకు అండగా నిలుస్తూ… సేవయే పరమావధిగా జీవిస్తున్న ఆయన వ్యక్తిత్వం ఎందరికో స్ఫూర్తిదాయకం..200లకు పైగా అవార్డులు అందుకున్న ఆయన ప్రస్థానం అభినందనీయం.

“మానవ సేవయే మాధవ సేవ” అనే నినాదంతో, పేదలకు పిడికిడి అన్నం పెడుతూ, జంతువుల పట్ల అపారమైన ప్రేమ చాటుతూ ఆయన సాగిస్తున్న సామాజిక సేవలు చిరస్మరణీయం.

ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు షేక్ ఫరీద్ బాబా గారిపై వారి కుటుంబ సభ్యులపై మెండుగా ఉండాలని, ఆయన నిండు నూరేళ్లుగా ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటూ మరెన్ని సేవా కార్యక్రమాలు కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

                            ఇట్లు 
                మోహన్ నాయుడు 
                 సాక్షి టీవీ.. రిపోర్టర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *