భారతదేశ విముక్తి కోసం మేడే ఒక స్ఫూర్తి మే డే అంటే(అంతర్జాతీయ కార్మిక దినోత్సవం)రేణిగుంట మే 1రేణిగుంటలో వాడవాడల మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి మురళి గారు మాట్లాడుతూప్రతి సంవత్సరం మే 1న కార్మికుల హక్కులు, త్యాగాలను స్మరించుకుంటూ జరుపుకునే రోజు. 1886 మే 1న అమెరికాలోని షికాగోలో ‘8 గంటల పని దినం’ కోసం జరిగిన చారిత్రాత్మక సమ్మె, హేమార్కెట్ దురదృష్టకర సంఘటనల ఫలితంగా ఈ రోజు ఆవిర్భవించింది. కార్మిక సంఘాల పోరాటాల స్ఫూర్తితో, 1889లో మే 1ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా ప్రకటించారు.19వ శతాబ్దంలో కార్మికులు రోజుకు 12-16 గంటలు పని చేయాల్సి వచ్చేది. దీనికి వ్యతిరేకంగా అమెరికా ఫెడరేషన్ ఆఫ్ ఆర్గనైజ్డ్ ట్రేడ్స్ అండ్ లేబర్ యూనియన్స్ 1884లో 1886 మే 1 నాటికి 8 గంటల పని దినాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసింది.హేమార్కెట్ సంఘటన (1886): 1886 మే 1న లక్షలాది మంది అమెరికా కార్మికులు సమ్మె చేశారు. మే 4న షికాగోలోని హేమార్కెట్ స్క్వేర్‌లో జరిగిన ప్రదర్శనలో బాంబు పేలుడు, పోలీసుల కాల్పుల వల్ల కొందరు కార్మికులు, పోలీసులు మరణించారు.అంతర్జాతీయ గుర్తింపు: ఈ ఘటనలో మరణించిన వారి త్యాగాలను స్మరించుకుంటూ, 1889లో పారిస్‌లో జరిగిన సెకండ్ ఇంటర్నేషనల్ సమావేశంలో ప్రతి ఏటా మే 1న కార్మిక దినోత్సవం జరపాలని నిర్ణయించారు.భారతదేశంలో మొదటిసారిగా 1923, మే 1న మద్రాసులో హిందుస్థాన్ లేబర్ కిసాన్ పార్టీ నేతృత్వంలో మేడే వేడుకలు జరిగాయి.

ByRiyazvali K

May 1, 2026

కార్మికుల శ్రమను గౌరవిస్తూ, వారి హక్కుల కోసం చేసే పోరాటాన్ని గుర్తుచేస్తూ, ప్రపంచవ్యాప్తంగా మేడేను ఐక్యత దినంగా జరుపుకుంటారు.
ఈమే దినోత్సవం లేదా మే డే ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన జరుపుకునే స్మారక దినం. ప్రజా శెలవుదినం. చాలా దేశాలలో మే దినం, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా కార్మిక దినోత్సవంతో ఏకీభవిస్తాయి. ఇవి అన్నీ కూడా కార్మికుల పోరాటం, కార్మికుల ఐక్యతను గుర్తిస్తాయి. వారన్నారు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సాయి మాట్లాడుతూ మే డే ప్రపంచ కార్మికులకు ఎంతో స్ఫూర్తినిస్తుందని మేడే స్ఫూర్తితో కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని 44 లేబర్ చట్టాలను నాలుగు లేబర్ కోట్లుగా తీసుకువచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరుబాటికి సిద్ధం కావాలని ఎనిమిది గంటల పని విధానం అలాగే కనీస పనికి కనీస వేతనం మహిళలను రాత్రి పూట పని చేయించడం మానుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలకు దిగబడతామని వారన్నారు ఈ కార్యక్రమం రేణిగుంట గ్రామపంచాయతీ ఆఫీస్ నందు మరియు ఐ ఎం ఎఫ్ ఎల్ బేవరేజ్ గోడౌన్ నందు తారకరామ నగర్. అల్లిమెట్ట. నేతాజీ కాలనీ రేణిగుంట ముఠా సర్కిల్ బస్టాండు. అంబేద్కర్ సర్కిల్. మరియు పద్మా నగర్ లో చాలా ఘనంగా జరుపుకున్నారు ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి వైయస్ మణి ఏఐటియుసి మండల అధ్యక్ష కార్యదర్శులు డి రజాక్ వి కార్తీక్ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు రసూల్ సెలవా మోహన్ రెడ్డి భాను తరుణ్ భాను పంచాయతీ కార్మికులు సుబ్బరాజు చంద్రకళ పద్మా నగర్ కార్మికులు అమ్ములు అమ్ములు శివగామి ఐఎంఎఫ్ఎల్ డిపో నాయకులు గురవయ్య చంద్రయ్య రవీంద్ర నేతాజీ కాలనీ శివకుమార్ ఆశీర్వాదం రాజేష్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed