చిత్తూరు, మనధ్యాస, మే 1

రిపోర్టర్: కమల్ రెడ్డి

చిత్తూరు రూరల్ మండలం చెరువు ముందర ఊరు లో స్వయంభు గా వెలసిన ఈ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఘనంగా పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ఈ దేవస్థానంలో ప్రతి పౌర్ణమికి, హనుమాన్ జయంతికి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. అందులో భాగంగా శుక్రవారం ఉదయం పౌర్ణమి సందర్బంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకం చేసి వివిధ పుష్పాలతో స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం భక్తుల కు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ దేవస్థానానికి ప్రతి పౌర్ణమికి చుట్టుపక్కల ప్రాంతాలే కాక తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని ఆలయ ధర్మకర్త మురగయ్య తెలిపారు. ఈ దేవస్థానంలో భక్తులు కోరిన కోరికలు తీరుతాయని వీరాంజనేయ స్వామి భక్తులు ప్రతి పౌర్ణమికి అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *