“బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలి.” – ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సూచన..!
వింజమూరు ఏప్రిల్ 19, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు
వింజమూరులో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులైన గంజాం రాఘవేంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి, తనకు కల్పించిన అవకాశానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, రాష్ట్ర విద్య , ఐటీ శాఖ మంత్రివర్యులు మరియు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, తనపై నమ్మకం ఉంచి ఈ పదవి రావడానికి సహకరించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి గంజాం రాఘవేంద్ర కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన గంజాం రాఘవేంద్ర రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులవడం ఆనందదాయకమని పేర్కొన్నారు. అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో, భక్తిశ్రద్ధలతో నిర్వర్తించి మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కనిగిరి మండల అధ్యక్షుడు పూసాల వెంగప నాయుడు ,సోమశిల ప్రాజెక్ట్ ఉపాధ్యక్షులు మధుమోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
