మన ద్యాస, నెల్లూరు రూరల్, ఏప్రిల్ 2: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్ ముత్యాలపాలెంలో 1, 2, 12, 17 మరియు 19 డివిజన్లలో గురువారం 1 కోటి 15 లక్షల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. నా లక్ష్యం ఒక్కటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధే అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నిత్యం ప్రజల్లోన్నే ఉంటాం. కూటమి ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లోకి తీసుకొని వెళ్తాము అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం నేతలందరం ఒక్కతాటిపై ఉంటాం అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నిన్న జగన్ మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు చూసి పిల్లలు సైతం నవ్వుకుంటున్నారు అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ లో జరిగే అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు జిల్లాలో ఉండే శాసనసభ్యులను పిలిచి ఒక మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు అని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు. శ్రీధర్ అన్న ప్రజలతో మమేకమయ్యే తీరు అద్భుతం. నాయకులకు ఉండాల్సిన లక్షణాలు అన్నీ శ్రీధర్ అన్నకు ఉన్నాయి అని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు.పై కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జులు, కో క్లస్టర్ ఇంచార్జులు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ, జనసేన , బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

