మన ధ్యాస,నెల్లూరు, ఏప్రిల్ 2:నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ తుమ్మ మస్తాన్ ఆధ్వర్యంలో గురు వారం బాధితులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ……. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం, పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ 42291/ 1a లోపల 10.01 సెంట్లుపట్టాభూమి మా స్వాధీనంలో ఉన్నది. అయితే మా భర్త జనవరి 4న 1999 సంవత్సరమున మరణించడం జరిగింది. తన భర్త పేరు మీద ఉన్న భూమిని తనకు కలిగిన ముగ్గురు కుమారులైన చెరుకూరు వెంకటరవి, చెరుకూరు నందగోపాల్, చెరుకూరు శ్రీనివాసులు కలసి వ్రాయించుకోవడం జరిగింది. ఆ భూమిలో ఒక్కొక్కరికి3.33 ప్రకారం పంచుకోవడం జరిగింది. వారు ముగ్గురు కూడా ఎవరి పాటిక వారు సాగు చేసుకుంటున్నారు. కానీ రెవిన్యూ అధికారులు అడ్డుపడి తాము సాగు చేసుకుంటున్న భూమిలో వేసుకున్న పంటను అక్రమంగా దున్నిచ్చారు. ఈ భూమిని 2016లో కాల్వ శ్రీనివాసులు అనే వ్యక్తికి గుత్తకు ఇవ్వడం జరిగింది. అతను దౌర్జన్యంగా భూమిని కబ్జా చేసి తనదే భూమి అని అడ్డం తిరుగుతున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులకు, స్థానిక పోలీస్ స్టేషన్లో, ఎస్పీకి ఫిర్యాదు ఇచ్చిన ఫలితం లేకుండా పోయిందని వారు ఆరోపించారు. ఈ మేరకు రిపబ్లిక్యుని పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ తుమ్మ మస్తాన్ ఆధ్వర్యంలో గురువారం నెల్లూరు ప్రెస్ క్లబ్ లో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ- సందర్భంగా కొప్పల ప్రమీల, బాధితుల మాట్లాడుతూ తమ భూమిని తనకి ఇప్పించాలని వాళ్లు అధికారులను వేడుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *