మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలో బంజపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని పేద ముస్లిం కుటుంబాలు పండుగను ఆనందంగా జరుపుకోవాలనే లక్ష్యంతో రంజాన్ తోఫాను కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, సర్పంచ్ ఏలే సుగుణమ్మ,తహసీల్దార్ భుజంగరావు కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి బలుగు బడహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వ్యక్తి ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని ప్రతి నిరుపేద వ్యక్తులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్ప సర్పంచ్ అనిస్ పటేల్,ఆర్ ఐ సాయిలు, పంచాయతీ కార్యదర్శి బీమ్ రావు, తదితరులు ఉన్నారు.
వడ్డేపల్లిలో రంజాన్ తోఫా పంపిణీ.. సర్పంచ్ బొజ్జ అంజయ్య

నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ బోజ్జ అంజయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రజా పండరీ లు కలిసి నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫాను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతి నిరుపేదలకు సంక్షేమ మందే విధంగా చూస్తున్నారన్నారు.
పేదలకు ఎల్లప్పుడూ అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లయ్య గారి ఆకాష్

మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తున్న నిరుపేదల కోసం రంజాన్ తోఫాను మండల యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లయ్య గారి ఆకాష్,ఇఫ్తాకార్,తోటరాజు, మోతే రామ గౌడ్,మాజీ సర్పంచ్ కాశయ్య కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రంజాన్ తోఫా నిరుపేద ముస్లింలకు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం నిరుపేదల అభివృద్ధి సంక్షేమం కోసం ఎల్లప్పుడు పాటుపడుతుందని అన్నారు.