

మన న్యూస్: ప్రతినిధి డిసెంబర్ 14 జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ కోర్టు అదాలత్ లో 3387 కేసులు పరిష్కారం … అలంపూర్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో 3387 కేసులు పరిష్కరించినట్లు న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ న్యాయమూర్తి మిథున్ తేజ తెలిపారు. శనివారం నిర్వయించిన అదాలత్ లో 16 కేసులు రాజీ మార్గము ద్వారా కావడం జరిగింది. అందులో ఒకే కుటుంభ సభ్యులపై ఒకరి పై మరోకొకరు పెట్టుకొన్న కేసులుండడం తో న్యాయమూర్తి గారు మాట్లాడి రాజీకుదుర్చారు. 3371 కేసులలో నేరస్తులు నేరము ఒప్పు కోవడము ద్వార జరిమానా విధించగా 5,47,590 రూపాయలు నగదు రావడం జరిగింది కోర్ట్ ప్రాంగణం లో నిర్వయించిన జాతీయ అదాలత్ కు భారతీయస్టేట్ బ్యాంకు జనరల్ మేనెజర్ ప్రకాష్ చంద్ర బరోఋ , డివిజినల్ మేనేజర్ బినోద్ కుమార్ సిన్హా, రీజినల్ మేనేజర్ సునీత మరియు అలంపూర్ కోర్ట్ పరిధిలో ని భారతీయ స్టేట్ బ్యాంకు వివిధ శాఖా ల మేనేజరులు హాజరయ్యారు . అనంతరం న్యాయమూర్తిని శాలువాతో పూల బొకేతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కుమార్ , న్యాయవాదులు శ్రీధర్ రెడ్డి , తిమ్మారెడ్డి, శ్రీనివాసులు, వెంకటేష్ , శ్రీమతి రాజేశ్వరి , అలంపూర్ కోర్ట్ ఏజీపీ మధు , పీ పీ కార్తీక్ , అలంపూర్ సి ఐ రవిబాబు , తాలూకా న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది , అలంపూర్ ఎసై వెంకటస్వామి , మనోవపాడు ఎసై చంద్రకాంత్, కోర్ట్ పీసీలు తదితరులు పాల్గొన్నారు.