మన ధ్యాస,నిజాంసాగర్ ( జుక్కల్ ) అచ్చంపేటలోని ఎస్సీ బాలుర హాస్టల్ విద్యార్థులకు శుభ్రమైన వాతావరణం, మెనూ ప్రకారం భోజనం సమయానికి అందేలా చూడాలని మండల విద్యాశాఖ అధికారి వై. తిరుపతి రెడ్డి అన్నారు. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేటలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని మండల విద్యాశాఖ అధికారి తిరుపతిరెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశాల మేరకు ఆకస్మికంగా పరిశీలించడం జరిగిందన్నారు.హాస్టల్లో విద్యార్థుల హాజరు,సిబ్బంది వివరాలను పరిశీలించారు. హాస్టల్ నిల్వల రిజిస్టర్లో నమోదు చేసిన సరుకులను సక్రమంగా ఉన్నాయా లేదా అనిపరిశీలించారు.అనంతరం
హాస్టల్లోని మరుగుదొడ్లు, వంటగది వసతులను పరిశీలించి పరిస్థితులను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ..విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు సక్రమంగా అందేలా అధికారులు చూడాలని తెలిపారు.హాస్టల్లో పోషకాహారంతో కూడిన భోజనం మెనూ ప్రకారం సమయానికి అందేలా చూడాలన్నారు.విద్యార్థులు ఆరోగ్యంగా ఉండి చదువులో ముందంజలో ఉండే విధంగా చూడాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల శ్రద్ధతో పాఠాలు చెప్పి ఉన్నత శిఖరాలకు ఎదిగే విధంగా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ విఠల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
