మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )మొహమ్మద్ నగర్ మండలంలోని సింగీతం గ్రామంలో అంగన్ వాడి కేంద్రాన్ని శనివారం సర్పంచ్ సయ్యద్ రఫీ తనిఖీ చేశారు.అంగన్ వాడి కేంద్రంలో సమస్యలను అంగన్ వాడి టీచర్ గంగామణీ అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే తప్పనిసరిగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అంగన్ వాడి కేంద్రానికి ప్రభుత్వం సరఫరా చేసిన సరుకులను పరిశీలించారు.అంగన్ వాడి కేంద్రానికి విచ్చేసే చిన్నారులకు, గర్భిణీలు బాలింతలకు పోషకాలతో కూడిన పౌష్టికాహారం అందించాలని సూచించారు.అంగన్ వాడి కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అంగన్ వాడి కేంద్రాల పట్ల నిర్లక్ష్యం వహించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దన్నారు. కేంద్రానికి వచ్చే చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యను అందించడం ద్వారా చిన్నారులు అంగన్ వాడి కేంద్రాల పట్ల ఆకర్షితులయ్యేలా కృషి చేయాలి అన్నారు. నాణ్యతమైన రుచికరమైన భోజనాన్ని అందించాలన్నారు. సర్పంచ్ వెంట పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ నాయక్ తదితరులున్నారు.