మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) హసన్ పల్లి గ్రామంలో డ్వాక్రా మహిళల పొదుపు సంఘాల నుంచి తిన్న పైసలను కక్కించే వరకు ఊరుకునేది లేదని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన శంకుస్థాపనకు వచ్చిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. హసన్ పల్లి గ్రామంలో డ్వాక్రా మహిళా పొదుపు సంఘ సభ్యుల పైసలు తిన్న వారిపై అధికారులు విచారణ చేస్తున్నారని త్వరలోనే విచారణ అనంతరం మహిళా సంఘాలకు న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు.మహిళలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, నాయకులు గుర్రపు శ్రీనివాస్, సర్పంచులు గంగి రమేష్,మేఘన నగేష్, గోరుగంటి కిరణ్,బోయిని హరిన్, సయ్యద్ రఫీ,గజ్జల జీవన్, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు శారద,జిల్లా ఎస్టి సెల్ ఉపాధ్యక్షుడు లోక్య నాయక్,అబ్దుల్ కాలేక్,నాగభూషణం గౌడ్, మల్లయ్య గారి ఆకాష్, సంతోష్ రాథోడ్,లక్ష్మీ కాంత్ రెడ్డి, మోయిన్, భూమా గౌడ్,భాస్కర్ రెడ్డి, మంగలి చిన్న రాములు,తహసిల్దార్ లత, పంచాయతీరాజ్ శాఖ డిఈ మధుబాబు, డిఎల్పిఓ ప్రసాద్ రావు, ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి, ఎంపీఓ అనిత రెడ్డి, ఏఈ సాయి తేజ,ఐసిడిఎస్ సిడిపిఓ సౌభాగ్య, సూపర్వైజర్ రాజేశ్వరి, వజ్ర, పంచాయతీ కార్యదర్శులు శిరీష, రామకృష్ణ,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.”

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *