మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని తెల్గాపూర్,హాసన్ పల్లి గ్రామాలల్లో గ్రామపంచాయతీ భవనం,గాలిపూర్ గ్రామంలో అంగన్‌వాడీ భవనానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పూజ చేసి కొబ్బరి కొట్టి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..సుమారు రూ. 52 లక్షల వ్యయంతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు.
నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నానని అన్నారు.ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా నిరంతరం పని చేస్తున్నాని చెప్పారు.
వెనుకబడిన జుక్కల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నానని పునరుద్ఘటించారు..
కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలని నాయకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి,
డి ఎల్ పి ఓ ప్రసాద్ రావు, పంచాయతి రాజ్ డిఈ మధుబాబు,ఏఈ సాయి తేజ,
తహసీల్దార్ లత, సర్పంచులు గంగి రమేష్ ,బోయిని హరిణ్ కుమార్, మేఘన నరేష్,గజ్జల జీవన్,రఫీ,ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు లోక్య నాయక్, ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి, ఎంపీ ఓ అనిత,సిడిపిఓ సౌభాగ్య, అంగన్ వాడి సూపర్ వైజర్ రాజేశ్వరి,ఎంఈఓ వెంకటేశ్వర్లు, అంగన్ వాడి టీచర్ వజ్ర, నాయకులు మల్లయ్య గారి ఆకాష్ ,నాగభూషణం గౌడ్,గుర్రపు శ్రీనివాస్,అతిక్,మంగలి రాములు,కుర్మా వెంకట్ రాములు, మాజీ ఎంపిటిసి సరస్వతి,ఉప్ప సర్పంచ్ గంగారాం,తదితరులు ఉన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *