మన ధ్యాస,నిజాంసాగర్, జుక్కల్ నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఏలే సుగుణ ఆధ్వర్యంలో జీపి సెక్రటరీ భీమ్రావు ,వార్డు సభ్యులతో కలిసి పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామంలో నీటి కోసం సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.గ్రామ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటి సరఫరా సక్రమంగా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
వేసవిలో నీటి సమస్యలపై అప్రమత్తంగా గ్రామాభివృద్ధికి ముందడుగు వెయ్యాలన్నారు. గ్రామంలో మురికి కాలువలు ఇప్పటికప్పుడు శుభ్రం చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప్ప సర్పంచ్ అనిస్ పటేల్,తదితరులు ఉన్నారు.