రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సిందియా చేతుల మీదుగా అందుకున్న వార్డు.

బంగారుపాళ్యం, మనధ్యాస,ఫిబ్రవరి 23. రిపోర్టర్: కమల్ రెడ్డి

2024–2025 ఆర్థిక సంవత్సరానికి కరిడివారిపల్లి గ్రామానికి చెందిన బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఎ.అరుణ ఉత్తమ బీపీఎంగా ఎంపికయ్యారు.పోస్టల్ శాఖ అభివృద్ధికి విశేష కృషి చేసినందుకు అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సిందియా,పెమ్మసాని చంద్రశేఖర్ చేతుల మీదుగా ఈ గౌరవం దక్కింది.గత ఆర్థిక సంవత్సరంలో ఆమె ఆధ్వర్యంలో మొత్తం 524 కొత్త ఖాతాలు ప్రారంభించబడగా, 82 పోస్టల్ ఇన్సూరెన్స్ పాలసీలు నమోదు చేయబడ్డాయి.అదనంగా అత్యధిక మొత్తం ప్రీమియం వసూలు చేసి,562 డీబీటీ లావాదేవీలు విజయవంతంగా నిర్వహించారు.గ్రామీణ ప్రజలకు సమర్థవంతమైన పోస్టల్ సేవలు అందిస్తూ, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించినందుకు ఈ అవార్డు ప్రదానం చేయబడింది.ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ ఈ విజయం గ్రామ ప్రజల విశ్వాసం,ఉన్నతాధికారుల మార్గదర్శకత్వం మరియు సహచరుల సహకారం ఫలితమని పేర్కొన్నారు.భవిష్యత్తులో కూడా మరింత కృషి చేసి శాఖకు మంచి పేరు తీసుకురావాలని సంకల్పించారు.ఈ అవార్డు ఇండియా పోస్ట్ ప్రదానం చేయబడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *