మన న్యూస్: కామారెడ్డి జిల్లా : దొంగ నోట్ల తయారీ అంతర్రాష్ట్ర ముఠాను కామారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు ఈ దొంగ నోట్ల తయారీ ముఠా ఉద్దేశించి జిల్లా ఎస్పీ సింధు శర్మ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు బాన్స్వాడ పట్టణ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ కారులోని వ్యక్తులు పోలీసులను చూసి పారిపోతుండగా పోలీసులు వారిని పట్టుకొని విచారించి తనిఖీలు నిర్వహించగా కారులో 30 లక్షల రూపాయల నకిలీ నోట్లు ఉన్నాయని చూసి స్వాధీనం చేసుకొని వారిని అదుపులోకి తీసుకొని విచారించగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొందరు వివిధ రాష్ట్రాలకు కొందరము హైదరాబాదులో ఓ రూములో నకిలీ నోట్లు ప్రింట్ చేయడం జరుగుతుందని వాటిని బాన్స్వాడకు చెందిన వారికీ 30 లక్షలు ఇవ్వడం జరిగిందని మిగతా అక్కడనే రూములో ఉన్నాయని తెలపడం జరిగింది ఈ దొంగ నోట్ల తయారీలో ఆరుగురుని అదుపులోకి తీసుకొని విచారించి రిమాండ్ కి తరలించడం జరుగుతుందని వీరి వద్ద నుండి మొత్తం 56 లక్షల 90 వేల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకొని పరారీలో ఉన్న ఇద్దరిని కూడా త్వరలో పట్టుకొని విచారిస్తామని ప్రజలు ఎవరైనా వెయ్యికి బదులు 2000 ఇస్తామంటే ప్రజలు నమ్మవద్దని ఇలాంటి దొంగ నోట్ల ద్వారా ప్రజలు మోసపోవద్దని ప్రజలకు సూచించారు అలా ఎవరైనా చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలియజేశారు నకిలీ నోట్ల పట్టుబడడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిసిఎస్ పోలీసులను బాన్సువాడ పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *