మన న్యూస్: పినపాక నియోజకవర్గం, కరకగూడెం ప్రభుత్వ వైద్యశాలలో 108 వాహనంలోఈఎంటి ఉద్యోగిగా పనిచేస్తున్న మండల పరిధిలోని చిరుమళ్ళ గ్రామానికి చెందిన దోమల.ప్రణయ్ అనే యువకుడు గత నెల 30 వ తారీఖున పురుగుల మందు సేవించి ఈ విషయం ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా రెండు రోజుల పాటు ప్రభుత్వ వైద్యశాలలో వైద్యంచేయించుకోని ఈనెల రెండవ తేదిన అయ్యప్ప స్వామి ఇరుముడి కట్టుకోని శబరి వెళ్ళాడు అక్కడికి వెళ్ళినా తర్వాత ఆరోగ్యం సహకరించకపోవడంతొ తోటి స్వాములు అక్కడ వైద్యం చేయించి తిరిగి విజయవాడ రావడంతో ప్రణయ్ ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీనించడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.కుటుంబ సభ్యులు ఖమ్మం లో ఓ ప్రవేటు హాస్పటల్ చేర్పించారు. చికిత్సా పోందుతు రాత్రి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.అలాగే అతడు పినపాక మండలంలోని సహచర ఉద్యోగి వద్దనుండి కరకగూడెం గ్రామంలోని ఒక్కరి,ఇద్దరు వ్యక్తులకు డబ్బు అప్పుగా ఇప్పించి నందుకు మధ్యవర్తిగా ఉండటంలతో అప్పు ఇచ్చిన వ్యక్తి మృతుడు ప్రణయ్ అయ్యప్ప స్వామి మాలదారణ దరించి ఉన్న సమయంలో అతని ద్విచక్ర వాహనం లక్కోన్నడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తగినట్లుగా సన్నిహితులు, స్నేహితులు అనుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *