మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): బిచ్కుంద మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 7వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థి షేక్ లతీఫ్ పాషా ప్రజలను తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గెలిపిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా 7వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించిన షేక్ లతీఫ్ పాషా మాట్లాడుతూ, మున్సిపాలిటీ ఏర్పాటుకు ముందే తనకు రాజకీయ అనుభవం ఉందని, ఆ అనుభవంతో వార్డును మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి పరిష్కారం చూపుతానని తెలిపారు.అలాగే, ప్రజల కోసం నిజాయితీగా పని చేసే వ్యక్తిగా తనను గుర్తించి కుర్చీ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో కమల్ సెట్ మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.

