బంగారుపాళ్యం-ఫిబ్రవరి 08 మన ద్యాస
ఆంధ్రప్రదేశ్ తెలుగు నాడు గౌడ్ సంఘం అధ్యక్షులు రేఖా సుధాకర్ గౌడ్ అధ్యక్షతన మంగళగిరి లో గౌతు లచ్చన్న కమ్యూనిటీ హాలు నందు ఆదివారం జరిగిన రాష్ట్ర కల్లు గీత కార్మికుల సదస్సులో ముఖ్య అతిథిలుగా ఎ.పి.రాష్ట్ర గౌడ్ కార్పోరేషన్ చైర్మన్ వీరంకి వెంకట్ గురుమూర్తి, ఎ.పి.గీత కార్పోరేషన్ మాజీ చైర్మన్ తాతా జయప్రకాష్ నారాయణ గౌడ్ గీత కార్మికుల సమస్యలు పరిష్కారం పై చర్చించడం జరిగింది . మరియు ఈడిగ కార్పోరేషన్,శ్రీ శ్రయన కార్పోరేషన్,యాత కార్పోరేషన్, కల్లు గీత ఫైనాన్స్ కార్పొరేషన్ లో చైర్మన్ లను, మరియు డైరెక్టర్ లను ప్రభుత్వం నామినేట్ పదవులు నియమించాలని రాష్ట్ర తెలుగు నాడు గౌడ్ సంఘం తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపడం జరిగింది ఈకార్యక్రమంలో చిత్తూరు పార్లమెంటు టిడిపి ఈడిగ బిసి సాధికార సమితి అధ్యక్షులు బుసా నాగరాజ గౌడ్, చిత్తూరు జిల్లా ఈడిగ గౌడ్ సంఘం అధ్యక్షులు మద్దిలేటి క్రిష్ణమూర్తి గౌడ్, ప్రధాన కార్యదర్శి తుమ్మల గోపి గౌడ్, రాష్ట్ర ఈడిగ బిసి సాధికార సమితి కార్యదర్శి పరకాల వెంకటేష్ గౌడ్ చిత్తూరు పార్లమెంటు ఈడిగ సాధికార సమితి సభ్యులు కొత్త పల్లె రెడ్డిప్పగౌడ్, జిల్లా ఈడిగ గౌడ్ సంఘం యువసేన ప్రధాన కార్యదర్శి లేబాకుల మురళి గౌడ్ , వెంకటరమణ గౌడ్, విక్రం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
