వింజమూరు పట్టణాన్ని సుందరీకరణ చేయడమే లక్ష్యం..ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్..

వింజమూరు ఫిబ్రవరి 8, (మన న్యూస్ ప్రతినిధి).నాగరాజు కె.

వింజమూరు పట్టణంలో నెలకొని ఉన్న డ్రైనేజీ సమస్యను అధిగమించేందుకు కోటి 17 లక్షల రూపాయలతో సుమారు కిలోమీటర్ పొడవున ఆరు అడుగుల వెడల్పుతో నిర్మించునున్న డ్రైనేజీకి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ శంకుస్థాపన చేశారు. ఆదివారం ఎంపీపీ వనిపెంట హైమావతి మరియు కూటమి నాయకులతో కలిసి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ వింజమూరు పట్టణాన్ని సుందరీకరణ చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా డ్రైనేజీ సమస్యతో ప్రజలు సతమతమవుతున్నారని, ఈ సమస్యను పరిష్కరించేందుకు నుడా నిధుల నుండి 87 లక్షలు వింజమూరు మండల పరిషత్ నుండి 30 లక్షలు రూపాయలతో మొత్తం కోటి 17 లక్షలతో డ్రైనేజీ నిర్మాణం జరుగుతుందన్నారు.

అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం నుండి నేరేడుపల్లి రోడ్డు వరకు గతంలో బీటీ రోడ్డుగా శాంక్షన్ చేయడం జరిగిందన్నారు. దీనిని తిరిగి సిసి రోడ్డు నిర్మాణం చేపట్టినందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. శనివారం జరిగిన మండల పరిషత్ సమావేశంలో రెండు కోట్ల 50 లక్షల రూపాయలతో పనులు చేసేందుకు ఆమోదం తీసుకోవడం జరిగిందని కోటి 50 లక్షల రూపాయలతో వివిధ ప్రాంతాలలో అభివృద్ధి పనులు త్వరలో చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు మూడు కోట్ల రూపాయలతో సిసి రోడ్లు నిర్మాణం చేసుకోవడంతోపాటు, సామాజిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ సెంటర్, తీసుకురావడం జరిగిందన్నారు.

అన్నా క్యాంటీన్ ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. వింజమూరు డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు మరో మూడు డ్రైనేజీలు కూడా త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. బంగ్లా సెంటర్ నుండి బస్టాండ్ వరకు డివైడర్ ఏర్పాటు చేసి సెంట్రల్ లైటింగ్ పనులు చేయాల్సి ఉందన్నారు.

అదేవిధంగా వింజమూరు పాతూరు చెరువును ఆధునీకరణ చేసి సుందరంగా రూపుదిద్దుతామన్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఏర్పాటుకు కూడా కృషి చేస్తున్నట్టు తెలిపారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ బాబు సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి సొసైటీ చైర్మన్ చల్లా వెంకటేశ్వర్ల యాదవ్, సీనియర్ నాయకులు వనిపెంట సుబ్బారెడ్డి, మంచాల శ్రీనివాసులు నాయుడు, సర్పంచ్ నల్లగొండ్ల సృజన,బిజెపి ఉదయగిరి ఇంచార్జ్ కదిరి రంగారావు, జనసేన కోఆర్డినేటర్ కొట్టే వెంకటేశ్వర్లు, బిజెపి మండల అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి, జనసేన మండలాధ్యక్షులు బండారు సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యులు, పల్లా పురుషోత్తం, కాటం ప్రసన్న, సాదం మౌనిక, బసిరెడ్డి సుమలత,మండల ప్రధాన కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్ల యాదవ్, పట్టణ అధ్యక్షులు గురజాల గోపి, సొసైటీ డైరెక్టర్లు, కోడూరు నాగిరెడ్డి, గని శ్రీనివాసులు, కర్ణం శ్రీనివాసులు నాయుడు, కాటం రమణారెడ్డి, కో క్లస్టర్ ఇంచార్జ్ పాములపాటి మాల్యాద్రి, సాగునీటి సంఘం అధ్యక్షులు వేమూరి దొరస్వామి నాయుడు, తిరుపతి ఆచారి, కంచర్ల శ్రీనివాసులు, ఏగినేని శ్రీనివాసులు నాయుడు,చేజర్ల భాస్కర్ రెడ్డి, జయంత్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు షేక్ రఫీ, రేవునూరి రమణారెడ్డి,ఎంపీడీవో శ్రీనివాసులురెడ్డి, ఈవో పి ఆర్ డి కె రామారావు పంచాయతీ సిబ్బంది, తదితర నాయకులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *