ఉదయగిరి, మన ధ్యాస, ఫిబ్రవరి 07,(నాగరాజు కె ).

శనివారం స్త్రీ శక్తి భవన్ ఉదయగిరి నందు విద్యాంజలి కార్యక్రమం పై మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మండల అభివృద్ధి అధికారి శ్రీ శ్రీనివాసులు అధ్యక్షతన విద్యాంజలి మండల నోడల్ ఆఫీసర్ / ఉదయగిరి మండల విద్యాశాఖ అధికారి టి శ్రీనివాసులు, మండల విద్యాశాఖ అధికారి టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమము జరిగినది. ఈ సందర్భంగా మండల అధికారులు మాట్లాడుతూ విద్యాంజలి కార్యక్రమమును కేంద్ర ప్రభుత్వం 2017 వ సంవత్సరంలో ప్రారంభించిందని మన రాష్ట్రంలో విద్యాంజలి కార్యక్రమము 2026 సంవత్సరం నుండి ప్రారంభమైందని తెలియజేశారు. విద్యాంజలి కార్యక్రమము యొక్క ముఖ్య లక్ష్యం నాణ్యమైన విద్యను అందించడంతోపాటు పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమమును ప్రారంభించడం జరిగిందని చెప్పారు.ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు కలసి ఆ గ్రామంలో పూర్వ విద్యార్థులు, రిటైర్డ్ ఉద్యోగులు , ఆర్థికంగా మంచి స్వాలంబన కలిగిన వారితో,గ్రామంలో ఉండే పెద్దలతో ఒక కమిటీ ఏర్పాటు చేసి వారిని విద్యాంజలి కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ చేయించి వారి సేవలు మరియు పాఠశాల కావలసిన మౌలిక వసతులను ఏర్పాటు చేసుకోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యాంజలి కార్యక్రమ కోఆర్డినేటర్ / జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జె మాధవరావు, ఎస్ ఆర్ జి / ప్రాథమికోన్నత పాఠశాల పుల్లాయపల్లి ప్రధానోపాధ్యాయులు జి సుబ్బారెడ్డి , రిసోర్స్ పర్సన్ గా షబ్బీర్ కాలనీ పాఠశాల ఉపాధ్యాయులు మున్నా , అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
