మన ధ్యాస,నిజాంసాగర్(జుక్కల్): అంగన్ వాడి,పాఠశాలల్లో చిన్నారులకు నాణ్యమై న పౌష్టిక ఆహారం వడ్డించాలని ఎంపీడీవో శివ కృష్ణ అన్నారు.నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్ రావు పల్లి అంగన్ వాడి కేంద్రాన్ని, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను శనివారం ఆయన తనిఖీ చేశారు.అనంతరంచిన్నారులతోపాటు విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. పిల్లలతో కలిసి ఎంపీడీవో భోజనం చేశారు.గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ భవనాన్ని పరిశీలించారు.ఎంపీడీవో వెంట పంచాయతీ కార్యదర్శి జ్యోతి,మాజీ సర్పంచ్ సాయిలు తదితరులు ఉన్నారు.
