మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 3వ వార్డు పరిధిలోని బోయివాడ వాసులతో కలిసి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు,3 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన దర్బల్ కార్తీక సంతోష్ లతో కలిసి ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా బోయివాడ వాసులు తమ ప్రాంతంలో ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కొంతమంది నాయకులు బోయివాడ వాసులను బెదిరిస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని,ఇలాంటి చర్యలను అసలు సహించేది లేదని అంటూ హెచ్చరించారు.
బోయివాడ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
వార్డులోని ఇళ్ల సమస్య, డ్రైనేజీ,తాగునీటి సమస్యలతో పాటు ఇతర మౌలిక సదుపాయాల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో అందరూ ఐక్యంగా ఉండి 3 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి దర్పల్ కార్తీక సంతోష్ లకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు..
