బంగారుపాల్యం , మనధ్యాస ఫిబ్రవరి 6. రిపోర్టర్ కమల్ రెడ్డి
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గం బంగారుపాలెం మండలం తగ్గువారిపల్లి పంచాయతీ పద్మావతి నగర్ వద్ద నూతనంగా నిర్మించిన శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ మహా కుంభాభిషేక మహోత్సవం 06-2- 2026 నుండి 8-2-2026 వరకు అంత్యంత వైభవంగా జరుగునట్లు ఆలయ ధర్మకర్తలు, కార్యనిర్వాహకులు తెలిపారు.శుక్రవారం,గణపతి,లక్ష్మి,నవగ్రహహోమం,పూర్ణాహుతి,మంగళహారతి సాయంత్రం గణపతిపూజ,నూతన విగ్రహగ్రామోత్సవం,శాంతి హోమం, పూర్ణాహుతి, దీపారాధన నిర్వహించారు.