బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కాకర్ల.
ఉదయగిరి ఫిబ్రవరి 3, (ఎల్లో సింగం ప్రతినిధి).
ఇటీవల కొన్ని రోజుల క్రితం ఉదయగిరి సమీపంలో జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి-కుమారులు సయ్యద్ సాహేర, సయ్యద్ మజహర్‌లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసి, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ హృదయ విదారక ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వారి స్వగ్రామానికి స్వయంగా వెళ్లి బాధిత కుటుంబాన్ని కలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పడంతో పాటు, ఈ అపార నష్టాన్ని తట్టుకునేలా మనోధైర్యం కల్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఇలాంటి విషాదకర ఘటనలో తమ కుటుంబం ఎదుర్కొంటున్న బాధను తాను పూర్తిగా అర్థం చేసుకుంటున్నానని తెలిపారు. ప్రమాద బాధిత కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని, అవసరమైన సహాయం అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు.
