కలిగిరి, మన న్యూస్, ఫిబ్రవరి 02,(నాగరాజు కె).
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను రాయలేని చెప్పలేని పదాలతో దూషించిన వైసిపి నాయకుడు అంబటి రాంబాబు, ఆంబోతురాంబాబు, చంద్రబాబు నాయుడు కి బహిరంగ క్షమాపణలు చెప్పేవరకు ఉపేక్షించేది లేదని తెలుగుదేశం పార్టీ రావులకొల్లు సర్పంచ్ పూసల వెంగపనాయుడు సోమవారం మీడియా సమావేశం తో విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి ప్రపంచ దేశాలు సైతం గౌరవించే మహోన్నత విజనరీ కలిగిన రాష్ట్ర ముఖ్యమంత్రిని, అన్ పార్లమెంటరీ, భాషతో బహిరంగంగా దూషించటం హేయమైన చర్యగా ఆయన పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి మాటలే మాట్లాడుతూ అధికారం పోయినా కూడా ఇలాగే ప్రవర్తించడం ఏమిటని ప్రజలు బుద్ధి చెప్పినా కూడా బుద్ధి మారకపోవటం దురదృష్టకరమన్నారు. దేశ రాజకీయాలను సైతం మార్చే శక్తి సామర్ధ్యాలు ఉన్న మహోన్నత నాయకుడిని దూషించటం సరికాదని ఈ ఉదంతంపై రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి భేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పి తీరాలని ఆయన డిమాండ్ చేశారు. 11 సీట్లకు పరిమితమైనప్పటికీ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయినప్పటికీ ఇంకా మార్పు రాలేదంటే ఆశ్చర్యంగా ఉందని ప్రజలు అన్ని గమనిస్తున్నారని బహిరంగ క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.