
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం;స్థానిక భవిత దివ్యాంగుల స్కూల్ మద్దుల రాజేశ్వరి ఆర్థిక సహకారంతో వాటర్ ఫిల్టర్ ను హెల్పింగ్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో గురువారం అందజేశారు.ఈ సందర్భంగా హెల్పింగ్ యూత్ సభ్యులు మద్దుల స్వరూప్ మాట్లాడుతూ భవిత స్కూల్ హెల్పింగ్ యూత్ ఆధ్వర్యంలో వాటర్ ఫిల్టర్ ను అందజేయడం చాలా సంతోషంగా ఉందని, విద్యార్థులకు అవసరమైన వస్తువులను హెల్పింగ్ యూత్ ద్వారా భవిష్యత్తులో మరిన్ని అందజేయడం జరుగుతుందన్నారు.అనంతరం ఉపాధ్యాయురాలు వాణి పద్మజ మాట్లాడుతూ హెల్పింగ్ సభ్యులు పాఠశాలకు విద్యార్థులకు అవసరమైన వస్తువులను గతంలో అందజేయడం జరిగిందని, ఇప్పుడు వాటర్ ఫిల్టర్ అందజేశారని, వాటర్ ఫిల్టర్ వల్ల విద్యార్థులకు స్వచ్ఛమైన మంచినీటిని అందజేయడం జరుగుతుంది అన్నారు.ఈ కార్యక్రమంలో భవిత స్కూల్ ఉపాధ్యాయురాలు సిహెచ్ వాణి పద్మజ,పి.బుజ్జి, హెల్పింగ్ యూత్ సభ్యులు ఎస్కే అలీషా,రామ్ లాల్, బoడికోటి,పర్వత శివ,బన్నీ,బాలు, విద్యార్థులు పాల్గొన్నారు.