కలిగిరి, జనవరి 26,మన న్యూస్, (నాగరాజు కె).

కలిగిరి మండలం పెద్దకొండూరు గ్రామ పంచాయతీ సచివాలయం లో మరియు స్కూల్ నందు సర్పంచ్ మొక్కా సుజాత ఆదర్వం లో గణతంత్ర దినోత్సవ సందర్బంగా జాతీయ జండా వందన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు,అనంతరం పిల్లలకు చక్లెట్స్ స్వీట్స్ పంచి పెట్టేరు.ఈ సందర్భంగా మొక్కా సుజాత మాట్లాడుతూ,ఈ సంవత్సరం మన దేశం 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న తరుణంలో, రాజ్యాంగ విలువలను మరింత బలంగా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందని అన్నారు.


జనవరి 26, 1950న భారత రాజ్యాంగం అమల్లోకి రావడంతో భారతదేశం ఒక సంపూర్ణ ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించిందని, ప్రతి పౌరుడికి సమాన హక్కులు, న్యాయం, స్వేచ్ఛ కల్పించడమే రాజ్యాంగం యొక్క ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ సహా అనేక మహానుభావుల అంకితభావం వల్లనే నేడు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఎదిగిందని తెలిపారు.దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని, రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ, చట్టాలను పాటిస్తూ ముందుకు సాగాలని ఆమె కోరేరు.ఐక్యత, క్రమశిక్షణ, దేశభక్తి ఇవే గణతంత్ర దినోత్సవం మనకు ఇచ్చే ప్రధాన సందేశాలని స్పష్టం చేశారు. జాతీయ జెండాకు ఘనంగా గౌరవ వందనం సమర్పించారు.ఈ కార్యక్రమం లో మాజి సర్పంచ్ మరియు బూత్ కన్వీనియర్ మొక్కా హజరత్ రావు,స్కూల్ చైర్మెన్ మొద్దు లక్ష్మి కుమారి, నీటిసంఘ అధ్యక్షులు డి రమేష్, బూత్ కన్వినియర్ డి సురేష్, డి వెంకటేశ్వర్లు, శివరాం, కొట్టె కొండయ్య, మొద్దు మస్తాన్, సచివాలయ సిబ్బంది, మరియు ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.
