తవణంపల్లి జనవరి 25 మన ద్యాస

తవణంపల్లి మండలంలోని ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం ఎమ్మార్వో మాధవరాజు, ఎంపీడీవో హరికృష్ణ రెడ్డి, ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని తవణంపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు, వీఆర్వోలు పంచాయతీ సెక్రటరీలు తవణంపల్లి పురవీధుల్లో పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఓటు హక్కు మన హక్కు ఓటుతో మీ భవిష్యత్తు మార్చుకో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోండి, ఇంకా పలు రకాల నినాదాలతో అవగాహన కల్పిస్తూ, తవణంపల్లి కూడలిలో మానవహారం నిర్వహించారు. అనంతరం సీనియర్ సిటిజనులను రెవెన్యూ అధికారులు ఘనంగా సత్కరించారు. ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదై ఓటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు,పంచాయతీ సెక్రెటరీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *