తవణంపల్లి జనవరి 24 మన ద్యాస
స్థానిక రైతుల ఆర్థిక అభివృద్ధిని ఆకాంక్షిస్తూ తవణంపల్లి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్( ఎఫ్. పి. ఓ.) ఆధ్వర్యంలో తవణంపల్లి మండలంలోని మత్యం గ్రామంలో ఏర్పాటు చేసిన మామిడి కవర్ల తయారీ కేంద్రం యూనిట్ను శుక్రవారం గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్యఅతిథి జిల్లా ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ మామిడి పండ్లకు కవర్లు కట్టడం వలన కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు. కవర్ల ఉపయోగించడం వలన రసాయనాల పురుగుమందుల పిచికారి గణనీయంగా తగ్గించవచ్చు పండ్లలో ఈగ ప్రభావం నుండి సురక్షితంగా కాపాడుకోవచ్చు అలాగే కవర్లు కట్టిన మామిడిపళ్ళకు నాణ్యత పెరిగి గిట్టుబాటు ధర సాధారణ పళ్ళతో పోలిస్తే అధికంగా లభిస్తుంది అని రైతులతో వివరించారు.ఏ.పీ .ఎం.ఏ.ఎస్ సంస్థ, ఎస్. బి. ఐ. ఫౌండేషన్ యాక్సిలరేషన్ ప్రోగ్రాం సహకారంతో ఈ కవర్ల తయారీ కేంద్రం ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో యూనిట్ సీఈఓ హిమ శేఖర్ రెడ్డి, ఎఫ్ పి ఓ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అధిక సంఖ్యలో పరిసర గ్రామాల రైతులు పాల్గొన్నారు