మన ధ్యాస, నాయుడుపేట, జనవరి 8: తిరుపతి జిల్లా, నాయుడుపేట లో గురువారం న్యూ మైత్రి షాపింగ్ మాల్ ను సినీ నటిమణులు పాయల్ రాజ్ పుత్, అనసూయ ప్రారంభించినారు.సినీ నటీమణులు పాయల్ రాజ్ పుత్, అనసూయ వేరువేరుగా షాపింగ్కు విచ్చేసిన వేళ షాపింగ్ అధినేతలు ఘన స్వాగతం పలికారు. సినీ నటీమణులు చూడడానికి నాయుడుపేట ప్రజలు ఎంతో ఉత్సాహంతో కేరింతలు కొడుతూ విచ్చేశారు.ఈ సందర్భంగా పాయల్ రాజు పుత్ మాట్లాడుతూ….నాయుడుపేటకు న్యూ మైత్రి షాపింగ్ మాల్ ప్రారంభానికి రావడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని తెలియజేశారు. నాయుడుపేట ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు న్యూ మైత్రి షాపింగ్ మాల్ విచ్చేసి వస్త్రాలు కొనుగోలు చేసిసంక్రాంతి పండుగ చేసుకోగలరని కోరారు. అనంతరం అనసూయ మాట్లాడుతూ….. నాయుడుపేట కు న్యూ మైత్రి షాపింగ్ మాల్ ప్రారంభానికి రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది అని తెలియజేశారు. నాయుడుపేట ప్రజలు, మహిళలు న్యూ మైత్రి షాపింగ్ మాల్ కు విచ్చేసి వాళ్లకు నచ్చిన వస్త్రాలు కొనుగోలు చేసి సంక్రాంతి పండుగ జరుపుకోవాలని కోరారు.షాపింగ్ అధినేతలు మాట్లాడుతూ….. సినీ నటిమణులు అనసూయ, పాయల్ రాజపుత్ మా న్యూ మైత్రి షాపింగ్ మాల్ కు ప్రారంభానికి రావడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చినది తెలిపారు.వారికి కృతజ్ఞతలు తెలిపారు. నాయుడుపేట ప్రజలు మహిళల మెచ్చే చీరలు, పురుషులు మెచ్చె షర్ట్లు ప్యాంట్లు కొనుగోలు చేసి మమ్మల్ని ప్రోత్సహించవలసినదిగా కోరారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మా షోరూం ప్రారంభం ఆఫర్గా వన్ ప్లస్ వన్ కలదు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం, షాపింగ్ అధినేతలు మహేష్,సుధీర్,మోహిత్, యుగంధర్ వారి బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *