మన ధ్యాస, బుచ్చిరెడ్డిపాలెం,డిసెంబర్ 31 :విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . బుచ్చిరెడ్డి పాళెం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల కోరిక మేరకు వి పి ఆర్ ఫౌండేషన్ ద్వారా 2 క్రికెట్ కిట్లు, 2 వాలీబాల్ మరియు 3 షటిల్ బ్యాడ్మింటన్ సెట్లను నెల్లూరు నగరం మాగుంట లేవుట్ లోని ఆమె నివాసంలో విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ…… గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో అద్భుతమైన ప్రతిభ దాగి ఉంటుందని వారికి సరైన ప్రోత్సాహం అందిస్తే వారు జాతీయ స్థాయికి ఎదగగలరని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా మైదానాల అభివృద్ధికి, విద్యార్థులకు అవసరమైన వసతుల కల్పనకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆమె తెలిపారు. స్పోర్ట్స్ కిట్లు అందుకున్న విద్యార్థిని, విద్యార్థులు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెనుబల్లి జడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ అనంతకృష్ణ, పి ఈ డి కంచర్ల శ్రీనివాసులు, తెలుగుదేశం సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, రాష్ట్ర చేనేత సంఘం నాయకులు కె వి శేషయ్య స్థానిక టిడిపి నాయకులు మహేంద్ర మరియు ఓడ పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.
