మన ధ్యాస ,కోవూరు,డిసెంబర్ 31 :ఇటీవల మరణించిన ఎన్టీవీ రిపోర్టర్ రాజశేఖర్ అకాల మరణం పట్ల ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన నివాసానికి వెళ్లి రాజశేఖర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. విషాదంలో ఉన్న రాజశేఖర్ భార్య, పిల్లలను ఓదార్చి సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో ప్రభుత్వం మరియు తాను రాజశేఖర్ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ధైర్యంగా ఉండాలని రాజశేఖర్ కుటుంబ సభ్యులకు ఆమె మనోధైర్యం యిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *