మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): నిజాంసాగర్ మండలంలో ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వడ్డే పల్లి గ్రామ సర్పంచ్‌గా బొజ్జ అంజయ్య ఘన విజయం సాధించారు.ఈ సందర్భంగా ఆయన మండల తహసీల్దార్ బిక్షపతి, ఎంపీడీఓశివకృష్ణ,ఎస్ఐ శివకుమార్ లను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో ఘనంగా సత్కరించారు.గ్రామాభివృద్ధికి అధికారుల సహకారం ఎంతో కీలకమని సర్పంచ్ అంజయ్య అన్నారు.గ్రామంలో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా అధికారులు సహకరించాలని కోరారు. ప్రజల సంక్షేమం కోసం సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ విఠల్ రెడ్డి,వార్డు సభ్యులు ముజీబ్, నాయకులు అంజయ్య, మోహన్ రెడ్డి,అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.