

మనన్యూస్: ప్రతినిధి డిసెంబర్ 10 జోగులాంబ గద్వాల జిల్లా కేడిదొడ్డి మండల కేంద్రంలో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల నూతన భవనాన్ని మంగళవారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ కుర్వ నల్ల హన్మంతు ప్రారంభించారు. 2017 లో కేటిదొడ్డి మండలానికి కేజిబివి మంజూరు కాగ భవనం లేకపోవడంతో ర్యాలంపాడు శివారులో గల ప్రభుత్వ క్వాటర్స్ లో కొనసాగిస్తున్నారు. కేటిదొడ్డి మండల కేంద్రంలో నిర్మించిన నూతన భవనం ఈ రోజు ప్రారంభించడంతో విద్యార్థినిలు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేజిబివి ఎస్ఓ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
