ఉదయగిరి నియోజకవర్గం ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహహ కార్యదర్శి బొల్లినేని వెంకటరామారావు
కలిగిరి,మన ధ్యాస, డిసెంబర్ 24,(నాగరాజు కె)
ఉదయగిరి నియోజకవర్గం ప్రజలందరికీ టిడిపి రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహహ కార్యదర్శి బొల్లినేని వెంకటరామారావు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.ప్రేమ, సేవాతత్పరత,క్షమా గుణాన్ని బోధించిన ఏసుక్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని బొల్లినేని ఆకాంక్షించారు.ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని నిజాయితీగా జీవించాలని,అందరం కలిసి మెలిసి ఐక్యత చాటుకుంటూ సమాజంలో స్ఫూర్తివంతమైన జీవితాన్ని గడపాలని ఆయన సూచించారు.జిల్లా ప్రజలందరిపై ఏసుక్రీస్తు ఆశీస్సులు మెండుగా ఉండి ప్రజలందరూ ఆయురారోగ్యాలు,తో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని,బొల్లినేని,వెంకటరామారావు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన,టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహహ కార్యదర్శి బొల్లినేని వెంకటరామారావు.ఉదయగిరి నియోజకవర్గం ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.ప్రేమ, క్షమాపణ,దయ, శాంతి,సహనం వంటి,సద్గుణాలతో ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు చూపిన సన్మార్గంలో పయనించాలని బొల్లినేని పిలుపునిచ్చారు.