మన ధ్యాస, ముత్తుకూరు, డిసెంబర్ 23 :నెల్లూరు జిల్లా,ముత్తుకూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.కృష్ణపట్నం, ముత్తుకూరు పంచాయతీలకు సోమిరెడ్డి సమక్షంలో నాలుగు వాహనాలను అప్పగించిన పోర్టు సీఈఓ జగదీష్ పటేల్, రాజేష్ రంజన్, రామ్, వేణుగోపాల్ తదితరులు. ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిమీడియాతో మాట్లాడుతూ………..అదానీ కృష్ణపట్నం పోర్టు సీఈఓ జగదీష్ పటేల్ అండ్ టీమ్ ఈ ప్రాంత అభివృద్ది, ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పన విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపడం అభినందనీయం అని అన్నారు.స్థానిక యువతలో వివిధ వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు అని అన్నారు.1200 మందికి శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు..ఇది చాలా ఆనందాన్ని ఇచ్చే అని తెలిపారు.2019కి ముందు టీడీపీ ప్రభుత్వంలో 42 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా 2.30 లక్షల మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది అని అన్నారు.వైసీపీ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ పై కక్షకట్టి నిర్లక్ష్యం చేశారు అని అన్నారు.ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చాక స్కిల్ డెవలెప్మెంట్ అంశం పూర్వవైభవం దిశగా సాగుతోంది అని తెలియజేశారు.సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం వద్ద 2 ఎకరాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం అని అన్నారు.ఈ క్రమంలోనే అదానీ కృష్ణపట్నం పోర్టు కూడా శిక్షణ కార్యక్రమాలు చేపట్టడం శుభపరిణామం అని తెలియజేశారు.ఇప్పటికే కృష్ణపట్నం గ్రామంలోని తుఫాన్ షెల్టర్ లో మహిళల కోసం కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభించారు..కంప్యూటర్ ట్రైనింగ్ కూడా అందుబాటులోకి రాబోతోంది అని అన్నారు.ముత్తుకూరు, కృష్ణపట్నం పంచాయతీలకు నాలుగు వాహనాలకు అప్పగించడం శుభపరిణామం అని తెలియజేశారు.రెండు వాహనాలను చెత్త తరలింపునకు ఉపయోగించనున్నారు అని అన్నారు.మరో రెండు వాహనాలను ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుంటున్న చిన్నారులను బడికి తీసుకెళ్లి రావడానికి ఉపయోగించనున్నారు అని తెలియజేశారు.చలివేంద్ర నుంచి గిరిజన పిల్లలు 2.5 కిలోమీటర్లు నడిచి ముత్తుకూరు స్కూలుకు రావల్సివస్తుంది..వీరితో పాటు కృష్ణపట్నం చిన్నారులు బడికి వెళ్లేందుకు ఈ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి అని అన్నారు.ముత్తుకూరులో సైడ్ డ్రైన్ల నిర్మాణానికి రూ.2.65 కోట్లు కేటాయించారు..మొదటి దశలో ఆర్అండ్ఆర్ కాలనీల్లో పనులు ప్రారంభించారు అని తెలియజేశారు.రూ.2 కోట్లతో శ్మశానంలో అవసరమైన వసతులు కల్పించనున్నారు అని అన్నారు.రూ.1.19 కోట్లతో 345 సోలార్ లైట్లు ఏర్పాటు చేయనున్నారు అని తెలియజేశారు.మినీ స్టేడియం నిర్మాణానికి మొదటి విడతగా రూ.24 లక్షలు ఖర్చుపెడుతున్నారు అని అన్నారు.డంపింగ్ యార్డుకు రూ.30 లక్షలు ఖర్చు చేయబోతున్నారు అని తెలియజేశారు.కృష్ణపట్నంలోనూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, మంచినీటి పథకం ఏర్పాటు చేయడంతో పాటు హైస్కూలులో కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, సోలార్ వీధిలైట్లు అందుబాటులోకి తెస్తున్నారు అని అన్నారు.అదానీ కృష్ణపట్నం పోర్టు సీఈఓ జగదీష్ పటేల్, సీఎస్ఆర్ హెడ్ రాజేష్ రంజన్, కార్పొరేట్ ఎఫైర్స్ రామ్, వేణుగోపాల్,మురళి, సాంబశివరావు తదితరుల ఆధ్వర్యంలో ఈ సౌకర్యాలన్ని మనకు అందుబాటులోకి వస్తున్నాయి అని తెలియజేశారు.ప్రజలందరి తరఫున అదానీ కృష్ణపట్నం పోర్టు యాజమాన్యానికి, ప్రతినిధులందరికీ ధన్యవాదములు తెలియజేస్తున్నాను అని అన్నారు.గిరిజన పిల్లలు బడికి వెళ్లడమే కష్టం.వారు రోజుకు రానుపోను 5 కిలోమీటర్లు నడిచివెళ్లడం ఇంకా కష్టసాధ్యం..వారి కోసం పోర్టు యాజమాన్యం వ్యాను ఏర్పాటు చేయడం సంతోషం అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *