*క్షేత్రస్థాయిలో ప్రతి బిడ్డకు పౌష్టికాహారం అందించాల్సిన బాధ్యత అంగన్ వాడీ సిబ్బందిదే మన ధ్యాస, పొదలకూరు,డిసెంబర్ 23 : నెల్లూరు జిల్లా,పొదలకూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మంగళవారం అంగన్ వాడీ సిబ్బందికి సెల్ ఫోన్లు అందచేసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ………సర్వేపల్లి నియోజకవర్గంలో 379 మంది అంగన్ వాడీ సిబ్బందికి రూ.53.06 లక్షల విలువైన సెల్ పోన్లు అందిస్తున్నాం అని అన్నారు.చిన్నారులు, మహిళలకు మెరుగైన సేవలందించడంతో పాటు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేసేందుకు ఇవి దోహదం చేస్తాయి అని అన్నారు.ఏ తల్లికైనా ఒకరిద్దరు బిడ్డలను చూసుకునే అవకాశం లభిస్తుంది. అంగన్ వాడీ సిబ్బంది మాత్రం కేంద్రానికి వచ్చే ప్రతి బిడ్డకు తల్లులే అని అన్నారు.ఇలాంటి అరుదైన అదృష్టం అంగన్ వాడీ సిబ్బందికి మాత్రమే దక్కుతుంది అని అన్నారు.అంగన్ వాడీ కేంద్రం పరిధిలోని ప్రతి బిడ్డను, గర్భిణులను గుర్తించి వారికి పౌష్టికాహారం అందించాలి అని అన్నారు.ప్రధానంగా గిరిజనులపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అని అన్నారు.గిరిజన బిడ్డలను చూస్తూనే వారిలో పౌష్టికాహార లోపం స్పష్టంగా కనిపిస్తుంది అని అన్నారు.బాల్యవివాహాలు జరిగేది కూడా ఎక్కువగా గిరిజనుల్లోనే…ఈ విషయంలో ఎదురయ్యే కష్టనష్టాలపై వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా అంగన్ వాడీ సిబ్బందిదే అని అన్నారు.సమాజంలో అత్యంత అమాయకులతో పాటు నిరక్షరాస్యులైన గిరిజనులే పలువిధాలుగా నష్టపోతుండటం, మోసపోతుండటం బాధాకరం అని అన్నారు.సర్వేపల్లి గ్రామ పరిధిలో 6.30 ఎకరాల గిరిజనుల భూములను ఓ పెద్దరెడ్డి కంపెనీలకు రూ.35 లక్షల చొప్పున అమ్మేశారు అని అన్నారు.స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా గిరిజనులు ఇంకా మోసపోతున్నారు అని అన్నారు.కూటమి ప్రభుత్వం వచ్చాక గిరిజనుల సమస్యలపై ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించాం..3 వేల మందికి పైగా ఆధార్ కార్డులు లేకపోవడం గుర్తించి వారికి అవి అందేలా చేశాం అని అన్నారు.ఒక్కో సచివాలయంలో 10 మందికి పైగా రెగ్యులర్ ఉద్యోగులు ఉండి కూడా 3 వేల మందికి ఆధార్ కార్డులు లేవంటే వారు ఏం చేస్తున్నట్లు అని అన్నారు. తరతరాలుగా పేదరికంలో మగ్గిపోతున్న గిరిజనుల అభ్యున్నతికి అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది అని అన్నారు.ప్రతి గిరిజన బిడ్డ బాగా చదువుకుని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించేలా ప్రోత్సహించాలని అధికారులు, ఉద్యోగులు, నాయకులకు పిలుపునిస్తున్నాను అని తెలియజేశారు.


