అంగన్వాడి శాశ్విత భవనాలకు కృషి చేస్తా,ప్రభుత్వ కార్యక్రమాలకు వారధిగా నిలవండి

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అంగన్వాడీ కార్యకర్తలకు దిశా నిర్దేశం

వింజమూరు, మన ధ్యాస, డిసెంబర్ 22,(నాగరాజు కె).

అంగనవాడి కార్యకర్తలు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 5జీ సెల్ ఫోన్ లను అంగనవాడి కార్యకర్తలకు ఉచితంగా అందజేస్తుందని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ తెలిపారు.సోమవారం వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో,నియోజకవర్గంలోని462 అంగనవాడి కేంద్రాల కార్యకర్తలకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదగా సెల్ ఫోన్ లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి విలువైన 5జీ సెల్ ఫోన్ లను అందజేస్తుందని తెలిపారు. వీటిని సక్రమంగా, ఉపయోగించుకొని ప్రభుత్వానికి చిన్నారులకు తల్లిదండ్రులకు వారధిగా నిలవాలని తెలియజేశారు.మూడు నుంచి ఆరు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పౌష్టికాహారం అందించడంతోపాటు,ఆటపాటలతో విద్యాబుద్ధులు నేర్పించాలని సూచించారు. ముఖ్యంగా అంగన్వాడి భవనాల సమస్యను అధికమిస్తామని తెలిపారు. కార్యకర్తలకు అండగా ఉంటానని అధైర్య పడకుండా ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందన్నారు.మీరందరూ ప్రభుత్వానికి అండగా నిలిచి చిన్నారులకు చక్కగా చదువు నేర్పించాలని ఎమ్మెల్యే దిశ నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో వింజమూరు సిడిపిఓ పద్మజాకుమారి,అడిషనల్ సిడిపిఓ,సర్మిష్ట ఉదయగిరి సి డి పి ఓ పుణ్యవతి, టిడిపి మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, బిజెపి మండల కన్వీనర్, అంబటి ఈశ్వర్ రెడ్డి, జనసేన మండల కన్వీనర్ బండారు సత్యనారాయణ, సర్పంచ్ నల్లగొండ్ల సృజన సీనియర్ నాయకులు గణపం సుదర్శన్ రెడ్డి, మంచాల శ్రీనివాసులు నాయుడు, గువ్వల కృష్ణారెడ్డి,మండల కో క్లస్టర్ కన్వీనర్ పాములపాటి మాల్యాద్రి, ఏగినేని శ్రీనివాసులు నాయుడు, పట్టణ అధ్యక్షులు గురజాల గోపి నాయుడు, ఎస్.కె మహబూబ్ బాషా, తిరుపతి ఆచారి, ప్రసాద్, ఆనంద్,తదితరులు ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *