

బంగారుపాళ్యం మన న్యూస్ డిసెంబర్ 8.
చిత్తూరు హరివిల్లు లలితకళా వేదిక ఆధ్వర్యంలో 2 పుస్తకాలు ఆవిష్కరణ అమ్మ ఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరు పద్మనాభ నాయుడు ఆధ్వర్యంలో జరిగింది.కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వాస్తవ్యులు గద్వాల సోమన్న రచించిన తొలకరి జల్లులు అనే పుస్తకాన్ని డాక్టర్ వల్లేరి హరి నాయుడు,అన్నపూర్ణమ్మ దంపతులకు రావడం జరిగింది అంకితమివ్వడం జరిగింది.కృష్ణదాసు తత్వాలు, కీర్తనలు పుస్తకము రెండవ భాగాన్ని కూడా ఈ కార్యక్రమంలో ఆవిష్కరణ చేయడం జరిగింది.కార్యక్రమానికి బిల్లింటి భాస్కర్ రెడ్డి సభా అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా కట్టమంచి బాలకృష్ణారెడ్డి, కృష్ణారెడ్డి, చంద్రశేఖర్ పిళ్ళై, నందకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.తొలకరి జల్లులు అనే పుస్తకానికి ఏ ఎల్ కృష్ణారెడ్డి సమీక్ష అందించగా కృష్ణదాసు కీర్తనలు తత్వాలు అనే పుస్తకానికి ఎమ్మార్ అరుణ కుమారి సమీక్ష చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనాభ నాయుడు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు విందు భోజనం ఏర్పాటు చేశారు. తదుపరి అమ్మఒడి పద్మనాభ నాయుడు ని అక్కడికి విచ్చేసిన వారు అభినందించారు