

మన న్యూస్: కార్యకర్తలందరూ నా కుటుంబ సభ్యులే.. అందరూ తప్పకుండా రావాలి. సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే బాలయ్య బాబు ఆశీస్సులతో రెండో సారి నుడా చైర్మన్ గా ఎన్నికయ్యా. మంత్రి నారాయణ నాయకత్వంలో నుడా పరిధిలోని అన్ని గ్రామాలను అభివృద్ది చేస్తాను. వైసీపీ అరాచక పాలనలో నన్ను నమ్మి నా వెంట నడిచిన వారికి అండగా ఉంటాను. అక్రమ కేసులు బనాయించినా.. నాకు తోడుగా ఉన్న వారిని జీవితాంతం గుర్తు పెట్టుకుంటా. వైసీపీ అరాచకం మొదలైన తొలి రోజే.. టీడీపీ అధికారంలోకి వస్తుందని నమ్మాను.. అందుకే పోరాటాలు చేశాను. నా ప్రతి అడుగులో బాలకృష్ణ సహకారం ఉంటుంది. మీ కోటంరెడ్డే నెల్లూరులో కష్టపడుతున్నారంటూ..సాక్షాత్తూ చంద్రబాబే.. బాలయ్యతో అన్నారు.. అది జీవితంలో మరిచిపోలేను. రాష్ట్ర మంత్రి నారాయణ సహకారంతో పదవికి వన్నె తెచ్చేలా పనిచేస్తానని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి అన్నారు.డిసెంబర్ 15న ప్రమాణస్వీకారం చెయ్యబోతున్నానని నా కుటుంబ సభ్యుల్లాగా భావించే ప్రతి ఒక్క కార్యకర్త తరలిరావాలని ఆయన విజ్నప్తి చేశారు.నెల్లూరులోని ఎన్టీయార్ భవన్ లో టీడీపీ ముఖ్యనేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు.ఈ సందర్బంగా కోటంరెడ్డి గత ఐదేళ్ల అరాచక పాలన గురించి కార్యకర్తల అందించిన తోడ్పాటు, బాలకృష్ణ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన సహకారం వంటి వాటి గురించి వివరించారు. సీఎం చంద్రబాబునాయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఆశీస్సులతో రెండో సారి నుడా చైర్మన్ పదవి దక్కిందన్నారు.మంత్రి నారాయణ నాయకత్వంలో నుడా పరిధిలోని గ్రామాలకు అభివృద్ది చేస్తానని స్పష్టం చేశారు. వైసీపీ అరాచక పాలన సమయంలో తనకు కార్యకర్తలు ఎంతో అండగా ఉన్నారని అక్రమ కేసులు బనాయించి తనను ఇబ్బంది పెట్టినా తానెక్కడా వెనకడుగు వెయ్యలేదన్నారు.కోటంరెడ్డి కష్టపడి పనిచేస్తున్నారంటూ సాక్షాత్త్యు చంద్రబాబునాయుడే బాలకృష్ణకు చెప్పడం తన జీవితంలో మరిచిపోలేని సంఘటన అంటూ చెప్పుకొచ్చారు. వైసీపీ ఐదేళ్ల కాలంలో కార్యకర్తలను కాపాడుకోవడం వల్లే పార్టీ తనను గుర్తించిందని పార్టీ కోసం, కార్యకర్తలకు కోసం ఎంతదూరమైనా పోరాటం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. డిసెంబర్ 15న జరిగే ప్రమాణస్వీకారానికి ప్రతి ఒక్కరూ హాజరై తనను ఆశీర్వించాలని కోటంరెడ్డి విజ్ణప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.