

మన న్యూస్: తిరుపతి పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్, టిడిపి సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి శాలువాతో ఘనంగా సత్కరించారు. మంత్రి కొల్లురవీంద్ర కు రేణిగుంట రోడ్డు లోని తెలుగుదేశం పార్లమెంట్ కార్యాలయంలో సోమవారం పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు.మంత్రిని కలిసిన వారిలోమాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, పార్లమెంటు టిడిపి అధ్యక్షులు నరసింహ యాదవ్, కార్పొరేటర్ ఆర్సీ ముని కృష్ణ సుబ్బు యాదవ్ లు ఉన్నారు.