

మన న్యూస్ సాలూరు డిసెంబర్8,
పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో 63 లక్షల వ్యయంతో అఫిషియల్ కాలనీ, శివాజీ సెంటర్, గొల్లవీధి, మరియు 6,7,8 వార్డుల డ్రైన్స్, రోడ్లులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి సంధ్యారాణి ఎన్నో ఏళ్ల కలగా మిగిలిన డ్రైన్స్ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సంధ్యారాణి కి అభినందనలు తెలిపిన 6,7 వార్డుల మహిళలు
పట్టణంలో నీళ్ళు లేని వీధులలో త్వరలోనే పైలట్ వాటర్ స్కీమ్స్ నిర్మిస్తాం మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శ్యామలాంబ అమ్మవారి జాతరకు ముందుగానే పట్టణంలో అవసరమైన ప్రదేశాల్లో రోడ్లు, మరుగుదొడ్లు, మంచినీరు ఇబ్బందులు లేకుండా చేస్తాం,అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు 8 వ వార్డులో స్వయంగా JCB వాహనం నడిపి పనులు ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి, కార్యకర్తలు నాయకులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.