మన ద్యాస ప్రతినిధి, సాలూరు :– మండలంలో సారిక గ్రామం వద్ద ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 1940కిలోల పిడిఎస్ రైస్ పట్టుకొని సీజ్ చేసినట్లు విజిలెన్స్, రెవెన్యూ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సారిక గ్రామానికి చెందిన సురేష్ దొర అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన వేరొకరి ఆటోలో పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుసుకున్న శ్రీకాకుళం విజిలెన్స్ అధికారులు మండల రెవిన్యూ అధికారులతో కలిసి సంయుక్తంగా దాడి చేసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆటోతో పాటు బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే సీజ్ చేసిన బియ్యం 19వందల 40కిలోలుగా పేర్కొన్నారు. ఆ మేరకు వీరిపై కేసు నమోదు చేసి రూరల్ పోలీసులకు అప్పగించారు. విజిలెన్స్ సిఐ సింహాచలం, ఎస్ఐ సతీశ్ కుమార్, ఆర్ఐ షేక్ మౌలాలి, కానిస్టేబుల్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.







