డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గొప్ప దేశభక్తుడు:జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

చిత్తూరు, మన ధ్యాస,డిసెంబర్ 6
భారతదేశ సామాజిక రాజకీయ ఆర్థిక సాంస్కృతిక పరిస్థితులన్నీ కూడా సరి సమానము చేసిన ఓకే ఒక వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం స్థానిక దర్గా కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి 69వ వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ ఘనంగా నివాళులర్పించారు, ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, నగర మేయర్ ఆముద, చూ డా చైర్మన్ కటారి హేమలత, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ యుగంధర్, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్ లోని మౌ అనే గ్రామంలో రాంజీ సక్వ ల్ బీమా భాయ్ అనే దంపతులకు 14 సంతానంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జన్మించాడు.1956 డిసెంబర్ 6న తుది శ్వాస విడిచారు. భారతదేశ ఎల్లకాలము స్వేచ్ఛ సమానత్వంతో సోదర బావ ప్రజాస్వామ్య గణతంత్ర భావాలతో విరా జిల్లెల్ల కలలుగని వాటిని భారత రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచారని పేర్కొన్నారు. జిల్లాలో ఎస్సీ గ్రామాలను అభివృద్ధి చేయడానికి సుమారు 13 కోట్ల రూపాయల జడ్పీ నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామని పేర్కొన్నారు వెనకబడి కులాలను అభివృద్ధి చేయడానికి అంబేద్కర్ ప్రత్యేక కృషి జరిపినాడని పేర్కొన్నారు, అంగన్వాడి, సోలార్ విద్యుత్తు, త్రాగునీటి పైపులను నిర్మాణాలు, ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం పనులు, చేతి బోర్లు మరమ్మత్తు పనులు, స్మశాన వాటిక అభివృద్ధి కొరకు చర్యలు చేపడుతున్నామని వివరించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *