కలిగిరి మండలంలోని పలు గ్రామపంచాయతీలలో సిగ్నల్ లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు సమస్య తీర్చేందుకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సహకారంతో కృషి చేస్తానంటున్న టీడీపీ రావులకొల్లు సర్పంచ్ పూసల వెంగప నాయుడు
*కలిగిరి,నవంబర్,29,మనధ్యాస,ప్రతినిధి(కె ఎన్ రాజు)*

ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలో ఉన్నటువంటి పలు గ్రామపంచాయతీలలో సిగ్నల్ లేక ప్రజలు వివిధ ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సహకారంతో రావులకొల్లు సర్పంచ్ పూసల వెంగప నాయుడు ఆధ్వర్యంలో మండలంలోని మారుమూల ప్రాంతాలు అయినటువంటి కొన్ని గ్రామాలు సిగ్నల్ లేక అనేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఆ సమస్యలు తీరుస్తామని ఆయన అన్నారు. ఏ గ్రామాలలో ఐతే సిగ్నల్ లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారో ఆ గ్రామాలలో,నెట్వర్క్ టవర్ నిర్మించి సమస్యలు తీరుస్తామని ఆయన అన్నారు.ఏ గ్రామాలలో ఐతే ప్రజలు నెట్వర్క్ లేక ఇబ్బంది పడుతున్నారో ఆ గ్రామాలలో జీరో సిగ్నల్ ఉన్న పంచాయతీల ఏమి ఐనా ఉంటే అక్కడ ఆ గ్రామ పంచాయితీలలో గవర్నమెంట్ భూమి 5 సెంట్లు ఉన్నట్లయితే బిఎస్ఎన్ఎల్ టవర్ ప్రతిపాదనలను ఆయా గ్రామాలకు పంపించి సిగ్నల్ లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు అక్కడ బిఎస్ఎన్ఎల్ టవర్ నిర్మించి ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగిచ్చేందుకు రావులకొల్లు సర్పంచ్ పూసల వెంగపనాయుడు కృషి చేస్తానని ఆయన అన్నారు









